నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం..!
– అల్లుడు కోసమే సీఎం రేవంత్ అరాటం
– ప్రజా ఉద్యమాలను అరెస్టులతో ఆపలేరు
– మాజీ ఎమ్మెల్యేను భేషరతుగా విడుదల చేయాలి
– జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి సంబంధమున్నట్లు అనుమానిస్తూ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను రాజుగౌడ్ ఖండించారు. లగచర్లలో జరిగిన వివాదానికి బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంబంధం లేకపోయిన కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతుందని అన్నారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.

లగచర్లలోని ఫార్మా సిటి పేరిట బలవంతంగా లాక్కోనేందుకు యత్నించడంతోనే రైతులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. అధికారులకు దాడులు చేయడం తప్పుగా బావిస్తున్నామని, దానిని ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటన బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అటు మూసీ నది, ఇటు ఫార్మ సిటీ పేరుతో రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అదేవిధంగా జహీరాబాద్‌లో ఫార్మా సిటీ, ఇతర పరిశ్రమల కోసం 19వేల ఎకరాలు అక్కడ ప్రజలు భూములు ఇచ్చేందుకు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినా, సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కోడంగల్‌ లో తన అల్లుడి కోసం పనిచేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

పార్టీ పిలుపు మేరకు ప్రజా ఉద్యమాలను చేపడుతామన్నారు. అరెస్టులో ఉద్యమాలను అపలేరన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గతంలో పార్టీలో ఉన్నప్పుడు తెలియదా చిల్లర పార్టీ ప్రశ్నించారు. ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి కూడా రైతులను, గ్రామస్తులను శిక్షించాలని అనడం దుర్మార్గమన్నారు. రైతులను చంపేస్తారా.. ఉరేస్తారా అంటూ మండిపడ్డారు. మీరు ప్రజల వైపు ఉన్నారా..? లేదా.. సీఎం రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా అని తెలపాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..!