అభివృద్దే.. కాంగ్రెస్ ఎజెండా..!
– కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– 9,10,12వ వార్డులో ఎన్నికల ప్రచారం
– 10వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ 9వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి చైతన్య ప్రశాంత్, 10వ వార్డులో అల్లాపురం శ్రీకాంత్, 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిల తరుపున ఎన్నికల ప్రచారం జరిగింది.

ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల అభ్యర్థులతో కలిసి స్థానిక ప్రజలతో మాట్లాడి కాలనీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన్యత ఇస్తోందని అన్నారు. వార్డులు పురోగతికి నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతోందని అన్నారు. తాండూరు అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.

ఎన్నికల్లో గెలిచిన తరువాత అర్హులైన వారికి ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణాభివృద్ధికి వేల కోట్ల నిధులు తీసుకవచ్చి తాండూరును ఆదర్శంగా తీర్చిద్దుతామని అన్నారు. మరోవైపు పట్టణంలోని 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, మురళీకృష్ణ గౌడ్, బంటుమల్లప్ప, సురేందర్ రెడ్డి, మధులత శ్రీనివాస్ చారి, 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వరూప మల్లేశం, ఆయా వార్డుల యువ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

