కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారం
– చాకచక్యంగా ప్రత్యేక ప్రణాళికతో దూసుకుపోతున్న వైనం
– అడుగడుగున ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
– తాండూరు మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో 36 వార్డుల్లో ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏ వార్డులో చూసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరునిగా, స్థానిక కాంగ్రెస్ నాయకునిగా, ఆర్బీఓఎల్‌ సీఈఓగా, మంచి పేరున్నబుయ్యని శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. కుడి చేతికి ఇటీవల ఆపరేషన్ అయినప్పటికీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజల్లో నిత్యం ఉండే నేతల కోసం, తాండూరు మున్సిపల్ అభివృద్ధి కోసం, కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి ఓటర్లు చెయ్యి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజెపి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మకూడదని సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ముందు ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందని, తమ అన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాలనలో తాండూరు ప్రశాంతంగా ఉందన్నారు. స్థానికంగా ప్రజలకు 24 గంటలు తాము అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను నిరంతరం తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అవుతేనే అన్ని విధాల బాగుంటుందని అన్నారు. అందుకు ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలను గడపగడపకు అందిస్తామన్నారు. నిరుపేదలను అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..!