కాంగ్రెస్‌కు వాత పెట్టాలే..!
– ఆరు గ్యారెంటీలపై నిలదీయండి
– ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయండి
– తప్పు ఓటు వేస్తే ఐదేళ్ల శిక్ష తప్పదు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– రూ. 1000 కోట్లు తేకుంటే రాజీనామా చేస్తారా
– ఎమ్మెల్యేకు పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్
– తాండూరులో బీఆర్ఎస్ రోడ్ షో సూపర్ సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేలా కారు గుర్తుకు ఓటు వేసి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో బీఆర్ఎస్ రోడ్ షో అట్టహాసంగా జరిగింది.

ఈరోడ్ షో కు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై తాండూరు మున్సిపల్ ఓటర్లను, పార్టీ నేతలను చైతన్యపరిచారు. కాంగ్రెస్ పాలనలో ఎవరైతే 2వేల ఫించన్ కు బదులు రూ. 4వేలు తీసుకుంటున్నారో..? కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం తీసుకుంటున్నారో..? నెలకు రూ.2500లు తీసుకుంటున్నారో..? కాంగ్రెస్ పార్టీకి ధైర్యంగా ఓటు వేసుకోవచ్చని అన్నారు. అవేవీ పంపకుండా కెసిఆర్ ఇచ్చిన రూ. 2 వేల పింఛన్, బతుకమ్మ చీర, రైతుబంధు, రైతు భరోసా బీ ఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందుకున్న వారు కారు గుర్తుకే ఓటు వేయాలని అన్నారు. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చిందో తన వ్యాఖ్యలతో ఎదేవా చేశారు. మహిళలకు బతుకమ్మ చీర, ముస్లిం మైనార్టీ క్రిస్టియన్లకు కానుకలు ఆపేసిన కాంగ్రెస్ వైపు ఉంటారా.. ? అనిల్ అమలు చేయను ప్రభుత్వాన్ని నిలదీస్తారా తేల్చుకోవాలన్నారు.

ఒకసారి తప్పు ఓటు వేసినందుకే ఐదేళ్లు శిక్ష అనుభవిస్తున్నామన్నారు. తాండూరులో ఇటు వైపు గట్టిరాయి ఉంటే.. అవతలి వైపు తూట్ పాలిష్ రాళ్లు ఉన్నాయని అన్నారు. తాండూరును మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సొంతింటిలాగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేలా కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని అన్నారు. తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా సాయిపూర్ నర్సింలు సత్తా ఉన్న నాయకుడు అని అన్నారు. అభివృద్ధికి నిధులు ఖర్చుచేసేందుకు వెనుకాడబోడని అన్నారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో 36వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
ఎమ్మెల్యే సవాల్‌కు సిద్దమా..?
మరోవైపు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహాకారంతో తాండూరుకు రూ. 1600ల కోట్లు తీసుకరావడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం, బస్తి దవాఖాలు, డ్వాక్రా భవనాలు, అంగన్వాడ్ భవనాలు, వార్డుకు రూ. 1కోటి చొప్పున నిధులు, రూ. 74కోట్లతో పాత తాండూరు రైల్వే బ్రిడ్జి, రూ. 16 కోట్లతో చిలుకవాగు, ఐటీఐ కాలేజీ తీసుకరావడం జరిగిందని గుర్తుచేశారు. ఇన్ని చేసినా తాండూరు ఎమ్మెల్యేకు కనిపించడం లేదని, మళ్లీ రోహిత్ రెడ్డి ఏం చేశాడని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే ఎత్తూరు కావడంతో కళ్లకు అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తాండూరుకు రూ. 1000 కోట్లు తీసుకవస్తామని చెబుతున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చే మూడేళ్లలో అట్టి నిధులు తీసుకరాకపోతే రాజీనామా చేసేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు. తాండూరు పట్టణ ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మున్సిపల్‌పై గులాబీ జెండాను ఎగురవేద్దాని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, నాయకులు డా.సంపత్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

