కాంగ్రెస్ పార్టీది అరాచక సంస్కృతి
– పార్టీ నేతల బెదిరింపుల వల్లే బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య
– ప్రశాంత ఎన్నికల బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదవులు పోతాయంటే అరాచాకాలకు పాల్పడే సంస్కతి కాంగ్రెస్ పార్టీకి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణ పేట్ జిల్లా ముక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చేస్తున్న ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్యపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరివైనా పదవులు పోతాయంటే ఇలాంటి అరాచకాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు.

పదవి కోసమే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ తీసుకవచ్చిన విధానాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఉమ్మడి జిల్లాలో ఓటమి భయంతోనే బీజేపీ అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హక్కులు కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని అన్నారు. ఓ వైపు రాజ్యాంగాన్ని కాపాడలంటూ రాజీవ్ గాంధీ పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. తాండూరు మున్సిపల్లో కూడా అరాచకాలు జరగవచ్చని అన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనీయర్ నాయకులు మనోహర్ రావు, పటేల్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

