నిమ‌జ్జ‌నం కంటే ముందు రోడ్లు భాగు చేయించండి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

నిమ‌జ్జ‌నం కంటే ముందు రోడ్లు భాగు చేయించండి
– తాండూరు ఆర్డీఓకు విన‌తిప‌త్రం అందించిన సాహు శ్రీ‌ల‌త‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాబోయే వినాయ‌క చవితి నిమ‌జ్జ‌న ఉత్సవాల నాటికి తాండూరులో రోడ్ల‌ను భాగు చేయించాల‌ని తాండూరు ఆర్డీఓ అశోక్‌కుమార్‌ను మున్సిప‌ల్ బీజేపీ కౌన్సిల‌ర్ సాహు శ్రీ‌ల‌త కోరారు. బుధవారం ఆర్డీఓ అశోక్‌కుమార్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ వ‌ర్షాల‌తో, మిష‌న్ భ‌గీర‌థ రోడ్ల‌తో ప‌ట్ట‌ణంలోని శివాజీ చౌక్, ఇందిరాచౌక్, భ‌ద్రేశ్వ‌ర్ చౌక్, రైల్వే గేటు రోడ్లు పూర్తిగా ద్వంస‌మ‌య్యాయ‌ని అన్నారు. వినాయ‌క చవితి త‌రువాత నిమ‌జ్జానికి ఆయా మార్గంలోనే వినాయ‌కుల‌ను త‌ర‌లిస్తార‌ని తెలిపారు. కావున నిమ‌జ్జ‌నం నాటి కంటే ముందు ఈనెల 13లోగా పాడైన రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయించి బాగుచేయించాల‌ని ఆర్డీఓకు విన‌తిప‌త్రం ద్వార విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ కౌన్సిల‌ర్ బంటారం లావ‌ణ్య‌, పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శి బంటారం భ‌ద్రేశ్వ‌ర్‌, సీనీయ‌ర్ నాయ‌కులు పూజారి పాండు, యువ‌నాయ‌కులు ర‌జ‌నీకాంత్, దోమ‌కృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.