చైర్మన్‌ ఎన్నికకు ముహుర్తం ఖరారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చైర్మన్‌ ఎన్నికకు ముహుర్తం ఖరారు..!
– ఇప్పటికే అధికారులకు ఉత్తర్వులు జారీ
– ఎన్నిక ప్రక్రియ ఎప్పుడంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల తరువాత కౌన్సిలర్లుగా ఎవరు గెలుస్తారు. చైర్మన్ ఎవరు అవుతారనే అందరి దృష్టి పడింది.

అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు అధికారులు ముందే ముహుర్తం ఖరారు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపల్ అధికారులకు ముందే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన తరువాత16న తేదిన చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు. బుధవారం ఎన్నికలు జరగగా శుక్రవారం కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. తాండూరు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 36వార్డులకు గాను 135 మంది బరిలో నిలిచారు. వీరి భవితవ్యం ఏమిటనేది శుక్రవారం తెలిసి పోతుంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరిగి గెలిచిన అభ్యర్థులకు అదే రోజు గెలుపు పత్రాలను అందజేశారు. కౌన్సిలర్ల అభ్యర్థుల అందరికి గెలుపు పత్రాలు ఇవ్వనున్నారు. 13న కౌంటింగ్ పూర్తయితే.. 16న చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కౌంటింగ్‌లో గెలిచిన కౌన్సిలర్లకు గెలుపు పత్రాలతో పాటు చైర్మన్ ఎంపికకు హాజరు కావాలని ఆహ్వాన పత్రాలను అందించనున్నారు.  గెలిచిన కౌన్సిలర్లు మెజార్టీ మద్దతుతో చైర్మన్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు. కౌన్సిలర్లతో పాటు ఈ ఎన్నికలో ఎక్స్-అఫీషియో సభ్యులు (స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీ) చైర్మన్ ఎన్నికలో పాల్గొంటారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న అభ్యర్థిని చైర్మన్‌గా ప్రకటిస్తారు.

ఇదికూడా చదవండి…

పుర ఓటు.. పుల్ డిమాండ్…!