2వ వార్డులో కాంగ్రెస్ హవా..!
– విజయం సాధించిన ప్రత్యూష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. పార్టీ నుంచి పోటీ చేసిన ప్రత్యూష విజయం సాధించింది. హోరా హోరీగా సాగించిన లెక్కింపులో ఉత్కంఠత రేపిపనప్పటికి కాంగ్రెస్ వైపే విజయం నిలించింది. 204 ఓట్ల మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రత్యూషను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
మరోవైపు విజయం సాధించిన ప్రత్యూష కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈవో బియ్యని శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆమెకు శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

