బహిరంగ వేలానికి రేషన్ బియ్యం..!
– 582 క్వింటాళ్ల బియ్యంకు బిడ్డింగ్
– పాల్గొనేందుకు బిడ్డర్లకు అవకాశం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో పట్టుబడిన సుమారు 583 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. ఈ బియ్యంను బహిరంగ వేలం వేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఈ విషయాన్ని మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలో అక్రమంగా పీడీఎస్ బియ్యమును తరలిస్తున్న వారిపై 6కేసులు నమోదు చేసి బియ్యమును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. స్వాధీనం పరుచుకున్న బియ్యాన్ని మండల స్టాక్ పాయింట్ వికారాబాద్లో 68.05 క్వింటాళ్లు, మండల స్టాక్ పాయింట్ పరిగిలో 86.50 క్వింటాళ్లు తాండూరులో 261.20 క్వింటాళ్లు, కొడంగల్ లో 167.15 క్వింటాళ్లు మొత్తం 582.90 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం వేయుటకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

ఆసక్తి గల వారు పేరు నమోదు చేసుకుని బహిరంగ వేలంలో పాల్గొనాలని సూచించారు. బహిరంగ వేలం ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేలంలో పాల్గొనే బిడ్డర్లు డీసీఎస్ఓ, వికారాబాద్ పేరుతో రూ.1,00,000/- EMD చెల్లించి, రసీదు పొందాల్సి ఉంటుందని తెలిపారు.


