భరత్ భూషణ్కు నివాళులు..!
– తాండూరులో ప్రథమ వర్థంతి
– పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– హాజరైన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ రాజకీయ నేత స్వర్గీయ భరత్ భూషణ్కు పలువురు నివాళులు అర్పించారు. ఆదివారం తాండూరు పట్టణంలో భరత్ భూషణ్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు.

గాంధీనగర్లోని బిడ్కర్ రఘు నివాసంలో నిర్వహించిన వర్దంతిలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి హాజరై భరత్ భూషణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, పలువురు నేతలు హాజరై నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భరత్ భూషణ్ మంచి నాయకుడని అని, ఆయన లేని లోటు తీరనిది అని అన్నారు. కుటుంబ సభ్యులకు భరోసా అందించారు. అదేవిధంగా వర్దంతిలో రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, ఆర్.బస్వరాజ్, అబ్దుల్ ఖవి, బీదర్ రాజశేఖర్, భగవాన్, శివానంద్ మడపతి, పునీత్ కుమార్, సిద్ధూ అయ్యా, బిర్కెట్ శివ, నర్సింహా, పలు సంఘాల నాయకులు పాల్గొని భరత్ భూషణ్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిడ్కర్ ఉశ, భరత్ భూషణ్ కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


