నాపరాతి పరిశ్రమకు ఊరట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నాపరాతి పరిశ్రమకు ఊరట..!
– ఎమ్మెల్యే కృషితో తగ్గనున్న ఆర్థిక భారం
– సన్మానించిన స్టోన్, క్వారీ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి పరిశ్రమకు ఊరట కలగనుంది. పరిశ్రమపై విధిస్తున్న విద్యుత్ యూనిట్ల ఆర్థిక భారం తగ్గబోతోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న కృషికి ఫలితం కనిపిస్తోంది.

ఈ మేరకు శనివారం తాండూరు స్టోన్ మర్చంట్స్‌ వెల్పేర్ అసోసియేషన్, మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. తాండూరులోని నాపరాతి పరిశ్రమలపై విద్యుత్‌ యూనిట్ల బిల్లులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ విషయంను ఇరు అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసకవెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు.

దీంతో తాండూరు నాపరాతి పరిశ్రమల విద్యుత్ యూనిట్లపై ఆర్థిక భారం తగ్గించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పాటు ఇప్పటి వరకు వసూలు చేసిన అదనపు మొత్తాన్ని రాబోయే బిల్లుల్లో సర్దు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాండూరు నాపరాతి పరిశ్రమ కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తోడ్పాటు అందించడం పట్ల అసోసియేషన్‌ సభ్యులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నయూం(అఫ్పూ), మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్‌, ప్రతినిధులు ఎంఏ సత్తార్, కుంచెం మురళిధర్, సయ్యద్ హబీబ్, సయ్యద్ జుబేర్ లాల తదితరులు ఉన్నారు.

విశ్వ వేధలో పండగల శోభ..!