ఆర్టీసీలో ఘనంగా మహిళా దినోత్సవం
– హాజరైన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆర్టీసీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డిలు హాజరయ్యారు. మహిళ దినోత్సవంను పురస్కరించుకుని డిపో ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం డీపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లు, సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా కండక్టర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.


