సమాజ స్పూర్తి దాయకులు మహిళలే
– మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
– ధ్యాన గురువులకు ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు.

ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని తాండూరు వాసవి మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తాండూరుకు చెందిన ధ్యాన గురువులు పరమేశ్వరి, రేణుకలను ఘనంగా సన్మానించారు. పరమేశ్వరి శ్రీ రామచంద్ర మిషన్(హర్ట్‌పుల్ నెస్)లో శిక్షకురాలుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రేణుకా శంకర్ జీ శిష్యురాలుగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్‌లో శిక్షకులుగా పనిచేస్తున్నారు.

వీరు తాండూరులో ధ్యానంలో అందరికి ఉచితంగా శిక్షణ ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించి వాసవి మహిళ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, ఆమె కోడలు నాగలక్ష్మీలు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సాధికారత, వారి హక్కులు మరియు సమాజంలో వారు అందిస్తున్న విశేష సేవలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.


