కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
– తాండూరుకు ఎమ్మెల్యే చేసిందేమి లేదు
– ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గానికి రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హాజరైన మనోహర్ రెడ్డికి గ్రామ నేతలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డప్పుల దరువులో, నేతలు, కార్యకర్తల నినాదాలతో ర్యాలీ కొనసాగింది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరుపున మనోహర్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిందేమి లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. ప్రజల మద్యకు వచ్చే దమ్ములేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ద్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతోనే తాండూరు అభివృద్ధి. పేదల సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ ఎంపీటీసీలు వెంకటమ్మ మొగులప్ప, ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ చంద్రకళ, మాజీ ఉపసర్పంచ్ మాణెప్ప, యువ నాయకులు గాజుల ప్రసాద్, వార్డు సభ్యులు, నాయకులకు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్. పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, ఎంపీటీసీ రాజ్ కుమార్, నాయకులు రాందాస్, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

