వీరశైవ యువదళ్‌ కార్యవర్గం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

వీరశైవ యువదళ్‌ కార్యవర్గం ఎన్నిక
– తాండూరు అధ్యక్షులుగా వాలి వినోద్‌ కుమార్
– 20 మంది కార్యవర్గ సభ్యులతో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వీరశైవ యువదళ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

వీరశైవ యువదళ్ గౌరవాధ్యక్షులుగా అగ్గనూర్ సంకేత్, అధ్యక్షులుగా వాలి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా మద్రిక చంద్రకాంత్, సడిగి వినోద్ కుమార్, బిర్కడ్‌ శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా కోటం త్రిశూల్, సహా కార్యదర్శులుగా తుప్పుడు రవికుమార్, పసారం గణేష్‌, హేరూర్ రాకేష్‌, కోశాధికారిగా మడపతి సిద్దయ్య స్వామిలను ఎన్నుకున్నారు.

అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా అడికి శషాంక్, గడిగి కిరణ్‌ కుమార్, మడపతి నాగేంద్ర ప్రసాద్, అన్నారం దినేష్ కుమార్, ముదేళ్లి ప్రశాంత్, గంగిమళ్ల మహేష్‌ కుమార్, గౌనూర్ సందీప్ కుమార్, కేరెళ్లీ రాహుల్, ముత్తగి వీరేశం, దోమ సతీష్ కుమార్, మఠం జగదీశ్వర్ స్వామి, కోర్వార్ ఓంకార్‌, సుంకరి సందీప్ కుమార్, బిర్కడ్ ప్రమోద్, గాండ్ల వినోద్ కుమార్, గాండ్ల పరమేశ్వర్, బంటారం జగదీశ్వర్, గూళీ శైలేష్‌, కారంజి కార్తీక్, మంచాల నందీశ్వర్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ వీరశైవ సమాజం, యువత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలను అందించండి..!