మున్సిపల్ కార్మికుడిని పరామర్శించిన నేతలు
– రూ. 8 వేల ఆర్ధిక చేయూత
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ కార్మికుడిని తాండూరు మున్సిపల్ ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. తాండూరు మండలం గౌతాపూర్‌కు చెందిన ఉశనప్ప అనే కార్మికుడు తాండూరు మున్సిపల్‌లో పనిచేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న మున్సిషల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి కార్మికుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం కార్మికుడికి రూ. 8 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్, జవాన్లు శ్రీనివాస్, సీహెచ్ అశోక్ తదితరులు ఉన్నారు.

