రూ. 1లక్ష 60వేల ఆస్తి పన్ను చెల్లింపు
– వసూలు చేసిన మున్సిపల్ సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో ఆస్తి పన్నుల వసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈనెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో అధికారులు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పన్నులు వసూలు చేస్తున్నారు. అధికారులు వెంబడిపడుతుండడంతో ఏండ్లుగా పెరుకుపోయిన బకాయిలను వ్యాపారులు, యజమానులు చెల్లింపులు చేస్తున్నారు.

శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీదుర్గ గ్రాండ్యూర్ హెటల్ నిర్వహకులు ఆస్తిపన్నులు చెల్లించారు. ఒకేసారి రూ. 1లక్ష 60వేల 54లను మున్సిపల్‌కు చెల్లించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ హైమద్, వార్డు ఆఫీసర్ అనిల్, సిబ్బంది శ్రీనివాస్, రజనీకాంత్, శ్రవంతిలు ఉన్నారు.


