రక్తదానంతో గర్భవతికి పునర్జన్మ
– డా.సంపత్ కుమార్ మానవత్వం
– 165వ సారి రక్తదానం చేసిన దాత
తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యవసర పరిస్థితిలో ఉన్న గర్భవతికి రక్తదానం చేసి తాండూరుకు చెందిన బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బాలాజీ నర్సింగ్ హోం అధినేత డా.సంపత్ కుమార్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు భార్య లలిత గర్భవతిగా ఉంది. ఆదివారం ఆమె కడుపులోనే తీవ్ర రక్తస్రావం అయ్యింది. అపస్మారక పరిస్థితికి వెళ్లే ప్రమాదం జరిగింది. వెంటనే ఓ నెగెటివ్ రక్తం అవసరమని భర్త నర్సింలు డా. సంపత్ కుమారడ్ దృష్టికి తెచ్చారు.

ఇందుకు డా.సంపత్ కుమార్ స్పందించి వెంటనే రక్తదానం చేశారు. దీంతో గర్భవతికి ప్రమాదం తప్పింది. దీంతో కుటుంబీకులు డా.సంపత్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు డా.సంపత్ కుమార్ 165వ సారి రక్తదానం చేశారు. అత్యవరసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఎందరికో ప్రాణదానం చేశారు.


