టాలెంటోళ్లు.. మెరిశారు..!
– ఒలంపీయడ్ పరీక్షల్లో 46 రాష్ట్ర ర్యాంకులు
– ప్రభంజనం సృష్టించిన శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్
– హర్షం వ్యక్తం చేసిన స్కూల్ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు టాలెంట్ చూపించారు. ఒలంపీయాడ్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 46 ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు.

ఈ విషయాన్ని స్కూల్ యజమాన్యం బుధవారం ఓప్రకటనలో తెలిపారు. 2025-26 ఫౌండేషన్ నీట్ ఒలంపీయాడ్ పరీక్షలు నిర్వహిస్తారు. 12వ అభ్యాసోత్సవం వార్షికోత్సవాల్లో భాగంగా 639కిపై పాఠశాలలు పాల్గొనగా 8లెవల్స్‌లో తాండూరులోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన 3వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 46 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మంగళవారం భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ క్రిష్ణారావు ఐఏస్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ డా.కె.అరవింద రావు ఐపీఏస్, కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి ఎండి డా. ఎవీ గురవారెడ్డి, పీ. సూర్య ప్రకాష్ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు పొందారు.

ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్దన్ రెడ్డిలు మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు పోటీతత్వంతో పాటు నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల్లో రాణించేందుకు పునాదులు వేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరిచి సాధించుకునేలా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎన్. రమేష్, సీనీయర్ ఉపాధ్యాయులు పి.చంద్రశేఖర్ రెడ్డి, ఎ.అనిల్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


