సమ్మర్‌లో సూపర్‌ డ్రింక్స్‌..!

ఆరోగ్యం జాతీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

సమ్మర్‌లో సూపర్‌ డ్రింక్స్‌..!
– సబ్జా గింజల్లో కొండంత పోషకాలు
– వేసవిలో ఎసీడీటీ, కడుపు ఉబ్బరంకు చెక్
దర్శిని డెస్క్ : వేసవిలో శరీరానికి ఉపశమనం కలిగించే డ్రింక్స్‌ కోసం చూస్తున్నారా..? అయితే సమ్మర్‌లో సబ్జా గింజల డ్రింక్స్‌ సూపర్ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..? దీని నుంచి కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం రండి. సబ్జా విత్తనాలు పైకి చిన్నవిగా కనిపించినా.. ఈ గింజల్లో పోషకాలు మాత్రం కొండంత ఉంటాయి.

సబ్జా గింజలు సహజంగానే శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే వీటిని వేసవి కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాల వల్ల చర్మం ఇన్ఫెక్షన్లకు గురవకుండా ఉంటుందంటున్నారు నిపుణులు. సబ్జా గింజలు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి కడుపును శుభ్రపరుస్తాయి.

సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ గింజలు సమ్మర్‌లో తీసుకుంటే పొట్టను చల్ల బరుస్తుంది.

సబ్జా గింజలను ఒక గ్లాస్ వాటర్‌లో మినమమ్ అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. సబ్జా సీడ్స్‌ని జ్యూసులు, సలాడ్స్, స్మూతీలు, షేక్స్, డిజర్ట్స్ ఇలా వేటిలో అయినా తీసుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడూ చేస్తుంటే శరీరంలో వేడి తగ్గడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

జీరా నీరులో అద్భుతాలు..!