రేపటి నుంచే ఒంటిపూట బడులు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రేపటి నుంచే ఒంటిపూట బడులు
– టైమింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన విద్యాశాఖ
– ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు సర్కారు అధికారికంగా జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ప్రాధమిక, ప్రాధమికోన్నత, ప్రభుత్వ, ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్‌కు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు నిర్వహించాలని.. ఆ తర్వాత విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు పదో తరగతి విద్యార్ధులకు మాత్రం పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్న నేపధ్యంలో ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైన పేర్కొన్న ఆదేశాలను తప్పనిసరిగా అన్ని స్కూల్స్ పాటిస్తున్నాయో.. లేదో పర్యవేక్షించాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.