తాగునీటి శాశ్విత పరిష్కారంపై దృష్టి
– కాగ్నా కొత్త పైపులైన్, అండర్ డ్రైనేజీ పనులకు పచ్చజెండా
– పారదర్శంగా మున్సిపల్ మాస్టర్ ప్లాన్
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మున్సిపాల్టీలో సాదారణ కౌన్సిలర్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం చేపట్టేందుకు దృష్టిసారించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు.

గురువారం తాండూరు మున్సిపల్ కార్యాయలంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం అనంతరం కౌన్సిల్లో చర్చించిన విషయాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తాండూరు పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. తాండూరు కాగ్నా నది నుంచి కొత్త పైపులైన్ వ్యవస్థ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ శాఖ, మిషన్ భగీరత అధికారులు, ఇరిగేషన్, పలు శాఖల అధికారులు పట్టణాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. కొత్త పైపులైన్ పనులు త్వరలోనే చేపట్టి కాగ్నానది నీటిని సరఫరా చేయిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని 36 వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు, ట్యాంకులు నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. దీంతో పాటు పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేయబోతున్నారని తెలిపారు.

మరోవైపు తాండూరు పట్టణంలోని గ్రీన్ ఫీల్డ్, పారిశ్రామికం, శిఖం భూముల్లో నివాసాలను ఒక వేదికపైకి తీసుకవచ్చి మాస్టర్ ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. నివాసాలు ఏర్పరుచుకున్న వారికి ఇళ్ల నెంబర్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన పేదలకు మంజూరు చేసేందుకు కసరత్తు చేయడం జరుగుతుందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని, కాసే చెట్టుకు రాళ్లు రువ్వే విధంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


