స్టేషన్ బేయిల్‌ కోసం లంచం డిమాండ్

తాండూరు రాజకీయం వికారాబాద్

స్టేషన్ బేయిల్‌ కోసం లంచం డిమాండ్
– రూ. 60వేలకు మహిళ పోలీసుల బేరం
– ఏసీబీకి పట్టించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్
– వికారాబాద్‌ మహిళ పోలిస్టేషన్ రైడ్‌లో పాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్టేషన్ బేయిల్ కోసం లంచం డిమాండ్ చేయడంతో అవినీతి పోలీసులను ఏసీబీకి పట్టించినట్లు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఈర్షాద్ తెలిపారు.

ఇటీవల తన కుటుంబంలో జరిగిన సంఘటనపై కొందరు వ్యక్తులు తప్పుదారి పట్టించి తనపై వికారాబాద్‌ మహిళ పోలీస్టేషన్‌లో సెక్షన్ 498ఏ కింద కేసులు నమోదు చేయించారని తెలిపారు. ఇందులో స్టేషన్ బేయిల్ మంజూరు కోసం ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రూ.60వేలు డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

లంచం పేరుతో అవినీతిని సహించలేక.. సంబంధిత అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు దాడులు నిర్వహించి.. అవినీతి పోలీసులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సంఘటనే కాకుండా గతంలో లంచం డిమాండ్ చేసిన 5 మంది అధికారులను చట్టం ముందు నిలబెట్టడంలో భాగస్వామి అయినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కాకుండా ప్రజల కోసం, న్యాయం కోసం తాను బాధ్యతగా పోరాటం చేస్తానని ఈర్షాద్ తెలిపారు.

పెత్తనం కోసమే బీజేపీ కుట్ర..!