సరస్వతీ కృపతో సమగ్ర జ్ఞానం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సరస్వతీ కృపతో సమగ్ర జ్ఞానం..!
– తల్లిని పూజిస్తే చదువులో ముందడుగు
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుల తల్లి సరస్వతీ దేవి కృపతోనే అందరిలో సమగ్ర జ్ఞానం సిద్దిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం వసంత పంచమి సందర్భంగా పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో అభ్యాస్ ఎడ్యూకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కౌన్సిలర్ పూజా రజనీ కాంత్, సోసైటి సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతిని పూజించడం మన సంప్రదాయమన్నారు. తల్లీ కృపతోనే అందరిలో జ్ఞానం, వాక్కు సిద్దిస్తుందన్నారు. చిన్నారుల విద్యారంభానికి శుభపరిణామన్నారు. తల్లీ అనుగ్రహంతో చిన్నారులు జ్ఞానాన్ని పొందుతారని అన్నారు. అదేవిధంగా వసంత పంచమి సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సోసైటీ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!