డబుల్‌ ఇండ్ల పంపిణీలో అసత్య ప్రచారాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ ఇండ్ల పంపిణీలో అసత్య ప్రచారాలు
– ఏ ప్రైవేటు సంస్థకు ఇండ్లను కేటాయించలేదు
– సంస్థ తరుపున అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
– ఎమ్మెల్యేపై ఓర్వలేని రాజకీయాలు తగదు
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ విషయంలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి అన్నారు.

ఆదివారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ పట్టణంలో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ఇండ్ల పంపిణీ చేస్తున్నారని వస్తున్న ప్రచారాలను ఖండించారు. పట్టణంలో ఏ ట్రస్టుకు ఇండ్లను కేటాయించలేదని స్పష్టం చేశారు. ట్రస్టు ద్వారా అర్హులైన పేదల తరుపున దరఖాస్తులను స్వీకరించడం జరగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్లతో నిజం చేస్తుందని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. తాండూరులోని అన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగిణలోకి తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులలో దాదాపు 8000 మందిని L2 అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తులలో అర్హులైన పేదలను గుర్తించి పారదర్శకంగా ఇండ్లను కేటాయిండం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్, హౌజింగ్ శాఖ అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

పదేళ్లలో ఇండ్లను పంపిణీ చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇండ్ల ముందుకు సాగడంతో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నాయని అన్నారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులైన పేదలకే ఇండ్ల పంపిణీ చేయడంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు స్పష్టతో ఉన్నారని అన్నారు.

ప్రభుత్వ పథకాలను అమ్ముకుంటున్న సర్కార్