ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా కట్కం వీరేందర్, కార్యదర్శిగా దర్మిది ప్రభు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది.

ఇటీవల 2026-28 సంవత్సరానికి గాను ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో 15 మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. వారిలో దివంగత నాగారం నర్సింలు పేరుతో కూడిన ప్యానల్‌లోని డైరెక్టర్లు అత్యధికంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులుగా కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులుగా బానకారి క్రిష్ణ, కార్యదర్శిగా దర్మీది ప్రభు, సహా కార్యదర్శులుగా నాగారం జగదీశ్వర్, కోశాధికారిగా సిహెచ్ భోజిరెడ్డిలు ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా ఎన్. జైపాల్ రెడ్డి, కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, చామ్‌కూర్ విశ్వనాథ్, బిక్కుమళ్ల శ్రీధర్, రాజేష్ సోని, దీనేష్‌ సింగ్, మంకాల రవీందర్, టి.బాలేశ్వర్ గుప్త, మల్లేపల్లి మధుసూదన్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారి కుంచెం మురళీధర్ అధ్యక్ష, కార్యదర్శులకు, సభ్యులకు నియామకపత్రాలను అందజేశారు.

నూతన అధ్యక్షులు కట్కం వీరేందర్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని అన్నారు. అనంతరం పలువురు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

ఇందిరమ్మ కాలనీలో కట్టడి.. ముట్టడి..!