వైభవంగా వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవం
– ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు
– పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డిని సన్మానించిన దేవాలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లోని వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.

మంగళవారం దేవాలయ వార్షికోత్సవం సందర్బంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో జరిగిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో చైర్ పర్సన్ దంపతులు హోమం, పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు.

పూజల అనంతరం దేవాలయ కమిటి సభ్యులు చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ఏకైక వరసిద్ది వినాయక దేవాలయం వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, అందులోనే మానసిక ప్రశాంతత దక్కుతుందని అన్నారు. దేవాలయ అభివృద్ధికి సహాకారం అందిస్తామని అన్నారు. మరోవైపు దేవాలయ వార్షికోత్సవం సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రాక, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన అఫ్పూ(నయూం)