నిరుద్యోగులకు శుభవార్త..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrనిరుద్యోగులకు శుభవార్త..!
– డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల ఆహ్వానం
– తుది గడువు ఎప్పటి వరకు అంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. వివేక్ దూబే ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్-1, తెలుగు-1, వాణిజ్య శాస్త్రం-1, రాజనీతి శాస్త్రం-1, గణిత శాస్త్రం-1, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్-1, జ తుశాస్త్రం -1లో పోస్టులను దరఖాస్తు కోరుతున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులలో 55 మార్కులతో పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలని, పీహెచ్/ఎస్ఈటీ/ఎస్ఈటీ కలిగి ఉన్నవారి ప్రాధాన్యత ఉంటుందన్నారు. బోధన అనుభవం ఉన్న వారు సర్వీసెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు జులై 1వ తేదిలోపు సాయంత్రం 4గంటలలోపు కళాశాలలో సమర్పించాలని సూచించారు.

ఇదికూడ చదవండి..

చిన్నారి చదువుకు చేయూత..!