ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
– బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాండూరులో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.

తాండూరులోని పైలెట్ రోహిత్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి గారు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు వెంకట్ రెడ్డి, మంకాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, మధు గౌడ్, చందర్, ఇర్ఫాన్, బషరత్, చెన్ బసప్ప, రవీందర్, కౌన్సిలర్లు నవీన సంతోష్ గౌడ్, సుప్రీత కరుణాకర్, నాగలక్ష్మి, జావేద్, యోగానంద్, ఇర్షాద్, సురేష్ నాయక్, నాయకులు అబ్దుల్ సలీం, సంతోష్ గౌడ్, గుండప్ప కరుణాకర్, రుద్రు పాటిల్, భీమ్ సింగ్, అనంత రెడ్డి, చెన్నారెడ్డి, కోట్రీకే శ్రీకాంత్, అంజాద్ ఖాన్, ఫైసల్ ఖాన్, అస్ఫక్, బీఆర్ఎస్వీ నాయకులు ఇబ్రహీం, వినోద్, సోహెబ్, తదితరులు పాల్గొన్నారు.


