మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి
– పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
– ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటా
– తాండూరు కొత్త కమీషనర్ పి. రాకేష్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ను మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని కొత్త కమీషనర్ పి. రాకేష్ రెడ్డి అన్నారు.

తాండూరు మున్సిపల్ కమీషనర్ గా బుధవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కమీషనర్ మధుసూదన్ రెడ్డి బదిలీపై సైబరాబాద్ కార్పొరేషన్ కు వెళ్ళారు.

ఆయన స్థానంలో కొత్తగా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న పాల్వాయి రాకేష్ రెడ్డిని కమీషనర్ గా నియమించింది. ఈ మేరకు రాకేష్ రెడ్డి తాండూరు మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ను మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ అభివృద్ధికి కౌన్సిలర్లు, ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డిని కమీషనర్ మర్యాద పూర్వకంగా కలిశారు. మరోవైపు కమీషనర్ కు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, పలు విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.


