స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు బీఎస్‌ఆర్ శుభాకాంక్షలు

తాండూరు రాజకీయం వికారాబాద్

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు బీఎస్‌ఆర్ శుభాకాంక్షలు
– ఇంటికి వెళ్లి విసెస్ చెప్పిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన సభ అధ్యక్షులు, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ, సీనీయర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

గురువారం స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ జన్మదినోత్సవం సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు పూలే బొకేను అందించి.. శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ శ్రీనివాస్ రెడ్డిని ఆలింగనం చేసుకుని దరహాసాలు చిందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జన్మదినం జరుపుకుంటున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తదితరులు ఉన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం