జననేత పైలెట్ రోహిత్ రెడ్డి
– మాజీ కౌన్సిలర్ సరితా హరిహరగౌడ్
– 13వ వార్డులో ఘనంగా బర్త్ డే వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జనహృదయ నేత అని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సరితా హరిహరిగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని 13వ వార్డులో బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్ కేక్‌ను కట్ చేశారు. ఈ సమయంలో వార్డు నాయకులు, కార్యకర్తలు జై రోహిత్ రెడ్డి, జై జై రోహిత్ రెడ్డి అంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలతో హొరెత్తించారు. అనంతరం కేక్‌ను ఒకరికొకరు తినిపించుకుని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సరితా హరిగౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన హృదయ నేతగా నిలిచారని కొనియాడారు. పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో తాండూరు రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. జనం ఆయన వెన్నంటే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడ ఆయన విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు చింటు గౌడ్, నిరంజన్ గౌడ్, అంజి, హన్మిరెడ్డి, నరేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



