ఉపాధ్యాయుడిను ఢీ కొట్టిన ట్రాక్టర్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఉపాధ్యాయుడిను ఢీ కొట్టిన ట్రాక్టర్..!
– గాయాల పాలైన టీచర్, ఆసుపత్రికి తరలింపు
– ఢీ కొట్టింది ఇసుక ట్రాక్టరే అన్న స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధులకు వెళుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బైకును వెనుక నుంచి ఓ ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బాధిత ఉపాధ్యాయుడు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలో నివాసం ఉంటున్న బాలు యాలాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.

మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైకుపై బయల్దేరారు. కోడంగల్ రోడ్డుమార్గంలో యాలాలకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఉపాధ్యాయుడు బైకును బలంగా ఢీ కొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ఈక్రమంలో బైకుపై నుంచి కింద పడిన ఉపాధ్యాయుడు బాలుకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు బాలును పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.

కాగా ఉపాధ్యాయుడును ఢీ కొట్టిన ట్రాక్టర్ ఇసుక ట్రాక్టరే అని స్థానికులు తెలిపారు. ఇసుకను తీసుకవచ్చేందుకు వెళుతోందని చెప్పారు. ఇసుక ట్రాక్టర్ ఉపాధ్యాయుడును ఢీ కొట్టడం కలకలం రేపింది. మరోవైపు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడును యాలాల మండల పీఆర్టీయూ అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, తదితరులు పరామర్శించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

వేయి శుభములు కలుగు మీకు..!