– 75 వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : 75 వ స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలలో వేడుకలలో భాగంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆదివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల కళాశాల, నెహ్రు గంజ్, తాండూరు మున్సిపల్ కార్యాలయం, తదితర ప్రాంతాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పట్లోళ్ల నర్సింలు, అఫ్పూ(నయూం), శ్రీనివాస్ చారీ, సంతోష్ గౌడ్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.


