టీఆర్పీఈయూ అధ్యక్షులుగా రఘునందన్ గౌడ్
– రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్(టీఆర్పీఈయూ) జిల్లా అధ్యక్షులుగా రఘునందన్ గౌడ్ ఎన్నికయ్యారు.

శుక్రవారం వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు, కార్యదర్శి విజయ్ కుమార్ ఆచారి, శ్రీనివాస్, చందర్రావుల సమక్షంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఇందులో భాగంగా టీఆర్పీఈయూ జిల్లా అధ్యక్షులుగా రఘునందన్ గౌడ్, కార్యదర్శిగా నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకట్రాంరెడ్డి, జాయింట్ సెక్రెటరీగా ఆనంద్ కుమార్ గౌడ్, కోశాధికారిగా భాస్కర్ రెడ్డిలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షులు రఘునందన్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో పవర్ ఎంప్లాయిస్ యూనియన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందకు ధన్యవాదాలు తెలిపారు.


