డబుల్‌ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేస్తా

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేస్తా
– బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్‌
– జాబితాలో ఎంపికపై క్లారీటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : లబ్దిదారుల జాబితాలో తన భార్యపై వచ్చిన డబుల్ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేలా చూస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు.

శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ఈర్షాద్ భార్య పేరు రావడం పట్ల ఆయన స్పందించారు. 2020 సంవత్సరంలో డబుల్ బెడ్‌ రూం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు.

అప్పట్లో తమ పేరుపై ఇళ్లు లేదని చెప్పుకొచ్చారు. అప్పట్లో దరఖాస్తు చేసుకుంటే.. తాజాగా ఎంపిక చేసిన జాబితాలో తన భార్య పేరు వచ్చిందని వివరించారు. ప్రభుత్వం ఇస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇంటిపై ఎలాంటి ఆశ లేదని అన్నారు. తన భార్యపై వస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని తన వార్డులోని అర్హులైన పేదలకు అప్పగించేలా చూస్తామని స్పష్టం చేశారు.

డబుల్ లబ్దిదారుల్లో కౌన్సిలర్ భార్య