సర్‌ను పారదర్శకంగా పూర్తి

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్‌ను పారదర్శకంగా పూర్తి
– ప్రతి పౌరుడు ఓటరు వివరాలను అందించాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) కార్యక్రమం పారదర్శకంగా పూర్తి చేసేందుకు అందరు సహకరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

గురువారం సర్‌ కార్యక్రమంలో భాగంగా యాలాల మండలం జక్కేపల్లిలోని బూత్ నంబర్ 205 లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్వయంగా ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, ఓటర్లు సమన్వయంగా పాటించాలన్నారు.

అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన ఓటరు వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు లేదా తొలగింపులకు సంబంధించి ఫారాలను సక్రమంగా నింపి అధికారులకు అందించాలని సూచించారు. సర్‌కు అందరు సహకరిస్తేనే నిజమైన ఓటర్ల హక్కులు పరిరక్షించేందుకు సహకరించే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్‌ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, తాండూరు ఏఏంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, బీఎల్‌ఓ షమీ బేగం, బీఎల్‌ఏ రామకృష్ణ, మండల అధ్యక్షులు మహిపాల్, అమృతప్ప, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శభాష్‌.. వినయ్‌..!