బుయ్యని చేదోడు చెరిగిపోదు..!
– శ్రీనన్న ప్రోత్సహాం మరువలేనిది
– అంతర్జాతీయ పోటీలో మెరిసిన గాజీపూర్ కుర్రోడు
– సెయిలింగ్ పోటీలో కాంస్య పతకం కైవసం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభిరుచి ఉన్న క్రీడాకారులకు తాండూరు నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అందించే చేదోడు చెరిగిపోలేనిదని, తనకు ఆయన అందించిన ప్రోత్సహాంతోనే అంతర్జాతీయ పోటీలలో సాధించిన కాంస్య పతకమే నిదర్శమని క్రీడాకారుడు ఎర్రా హర్షవర్దన్ కొనియాడారు.

పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన జాతీయ సెయిలింగ్ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్ ఈ నెల 24వ తేదీ నుండి మలేషియాలోని లంఖావిలో నిర్వహించనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆర్ధిక భారంతో పోటీల్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసుకున్న ఆర్బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎర్రా హర్షవర్ధన్ కు రూ. 1,50,000లను చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించారు.

దీంతో ఎర్రా హర్షవర్దన్ అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో భారత దేశం తరుపున కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ తాండూరుకు చెందిన నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అందించిన చేదోడు జీవితంలో ఎన్నటికి చెదరిపోదని అన్నారు.

ఆయన అందించిన ప్రోత్సోహాంనే తాను అంతర్జాయతీయ స్థాయిలో భారత దేశానికి కాంస్య పతకాన్ని సాధించడం జరిగిందని పేర్కొన్నాడు. శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు హర్షవర్దన్ అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో భారత దేశం తరుపున కాంస్య పతకం సాధించి దేశ కీర్తిని చాటి తాండూరుకే గర్వకారణంగా నిలవడం పట్ల శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


