చేనేత హస్తకళలను ఆదరించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేనేత హస్తకళలను ఆదరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన. అమ్మకములు స్టాల్స్‌ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత హస్తకళలు పురాతనమైనవని అన్నారు.

విభిన్న రూపాల్లో సంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత హస్తకళలను అందరూ ప్రోత్సహించి ఆదరించాలన్నారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకున్నాయని, ప్రతి ఒక్కరూ ప్రదర్శనను సందర్శించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, సర్ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఆర్యవైశ్య కమిటీ సభ్యులు, చేనేత హస్తకళల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


