డబుల్‌ రభస..

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ రభస..
– చిక్కుల్లో మున్సిపల్ మేనేజర్‌
– సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ..?
– అధికార యంత్రాంగంలో చర్చనీయాంశం
తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన డబుల్‌ రభస.. మేనేజర్‌ను చిక్కుల్లో పడేసింది. కార్యాలయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనపై వేటు పడినట్లు తెలిసింది.

జిల్లా కలెక్టర్ మున్సిపల్ మేనేజర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని సమాచారం. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై శనివారం మున్సిపల్ కార్యాయలంలో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో జరిగిన పలు రాజీకీయ పరిణామాలు ఉత్కంఠతను రేపిన విషయము విధితమే. అయితే సమావేశం నిర్వహణలో మున్సిపల్ మేనేజర్ నిర్లక్ష్యం వహించినట్లు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్‌కు నివేధిక అందించినట్లు సమాచారం.

బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కుర్చీపై ఎంఐఎం నేత పేరు ప్రదర్శించడం, డబుల్‌ లబ్దిదారుల రాండమైజేషన్ ఎంపికలో గందరగోళం ఏర్పడడంలో మేనేజర్ అలసత్వం వహించినట్లు నివేధించారని తెలిసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ మేనేజర్‌గా ఉన్న నరేందర్‌ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికార వర్గాలలో జోరుగా చర్చనీయాంశమైంది. దీంతో మేనేజర్ చిక్కుల్లో పడ్డట్లు అనిపిస్తోంది.

కొత్త జీవోలతో చెలగాటం ఆడోద్దు..!