కళ్యాణలక్ష్మీ చెక్కులకు స్వస్తి..!

జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కళ్యాణలక్ష్మీ చెక్కులకు స్వస్తి..!
– నిలిపివేయనున్న ప్రభుత్వం
– కొత్త విధానంలో సాయం పంపిణీకి కసరత్తు
– ఇక డబ్బులు ఎలా అందుతాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పేదింటి అమ్మాయిల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకం ద్వారా అండగా నిలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు చెక్కుల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. త్వరలో చెక్కుల రూపంలో అందించే విధానానికి స్వస్తి పలకనున్నారు. చెక్కులను అందించకుండా కొత్త విధానంలో కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటి వరకు ఈ పథకాల కింద లబ్దిదారులకు చెక్కుల రూపంలో అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆలోచన చేస్తోంది. ఈ రెండు పథకాలకు డీబీటీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్దిదారులు తమ దరఖాస్తు ఆన్ లైన్ లో చేసేందుకు వీలుగా కొత్త పోర్టల్ ను తీసుకొస్తోంది.

అదే విధంగా ఆమోద ప్రక్రియను ఆన్ లైన్ విధానంలోనూ పూర్తి చేయనుంది. దీని ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న లబ్దిదారులకు వగంగా పథకం నిధులు జమ అయ్యే విధంగా మార్పులు తీసుకొస్తోంది. ఇక నుంచి చెక్కుల విధానంలో కాకుండా లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా సాయాన్ని జమ చేయాలని (డీబీటీ) ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. త్వరలోనే కళ్యాణలక్ష్మీ చెక్కులకు చెక్‌ పడనుంది.

హైందవ చరిత్రలో గోవును విశిష్ఠ స్థానం