మంత్రుల పర్యటన ఖరారు..!
– రూ. 290 కోట్ల హ్యామ్ పనులకు శంకుస్థాపనలు
– రూ. 25 కోట్ల బైపాస్ పరిహారం చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మంత్రుల పర్యటన ఖరారయ్యింది. శనివారం తాండూరుకు తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబులు విచ్చేస్తున్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యామ్ ప్రాజెక్టు కింద తాండూరు నియోజకవర్గంకు మంజూరైన రూ. 290 కోట్ల పనులకు మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అంతారం గ్రామ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ లు శంకుస్థాపనలు చేయనున్నారు.

అదేవిధంగా ఉదయం 10:15 గంటలకు కందనెల్లి పరిధిలోని జీపీఆర్ గార్డెన్స్‌లో బైపాస్ భూనిర్వాసితులకు రూ.25 కోట్ల పరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం, ప్రగతి సభ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి విజ్ఞప్తి చేశారు.


