అమ్మాయిని మోసం చేసిన వీఆర్ఓ
– రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం
– పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
– ఆరుగురుపై కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భార్యకు పిల్లలు కావడం లేదని మరో యువతిని మాయ మాటలతో లోబరుచుకున్నాడు. పెళ్లిచేసుకోకపోతే బతకలేంటూ నమ్మించాడు. తీరా భార్యకు సంతానం కలగడంతో పెళ్లిలేదు.. గిల్లిలేదు కాదు పొమ్మన్నాడు. చదువుకుని.. సమాజంలో వీఆర్ఓగా కొనసాగుతున్న ఓ ప్రభుద్దుడే ఈ మోసానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన బోయ కార్తిక్ పెద్దేముల్ మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. తన భార్యకు పిల్లలు కావడం లేదని తాండూరు పోలీస్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలతో పలుమార్లు ఆమెను లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తరువాత భార్యకు సంతానం కలగడంతో అమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు. పెళ్లి విషయాన్ని ఎదిరించడి మాట్లాడడంతో పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తానని బెధిరించి పంపాడు. దీంతో బాధితురాలు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి వీఆర్ఓ కార్తిక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరు మందిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.



