బీఎస్ఆర్ నివాసంలో ప్రముఖుల సందడి..!
– అల్పాహార విందులో మంత్రులు, అధికారులు
– కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సన్మానించిన శ్రీనివాస్ రెడ్డి
– చేవేళ్ల ఎంపీ కొండాతో శ్రీనివాస్ రెడ్డి చర్చ
తాండూరు,దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అధికారులు సందడి చేశారు.

శనివారం తాండూరు పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తదితరులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందులో వారు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, చీప్ విప్ మహేందర్ రెడ్డి తదితరులు శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా శ్రీనివాస్ రెడ్డి నివాసంలో అల్పాహారం తీసుకున్నారు.

అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో తాండూరు ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విస్తరణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే అంశాలపై శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, అధికారుల రాకతో శ్రీనివాస్ రెడ్డి నివాసం సందడిగా మారింది.


