పండగలా రాజ్ కుమార్ జన్మదినోత్సవం
– సామాజిక సేవా కార్యక్రమాల్లో నేతల సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం పోరాడే.. తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి జన్మదిన వేడుకలు మిత్రులు శ్రేయోభిలాషులు యువకులు బీసీ సంఘం నాయకులు మహిళా సంఘం నాయకులు పండగలా జరుపుకున్నారు.
గురువారం తాండూరు పట్టణంలోని రాజ్ కుమార్ నివాసలంలో పలువురు నాయకులు కేక్‌ను కట్ చేశారు. పలు వార్డుల్లో మరియు పెద్దేముల్ బషీరాబాద్ తాండూరు యాలాల మండలాల్లో పలు గ్రామాల్లో యువకులు పెద్ద ఎత్తున రాజ్ కుమార్ కందుకూరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం తో పాటు పలు సేవా కార్యక్రమాలు
నిర్వహించారు. అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు ఆటవస్తువుల, వసతి గృహాల్లో పరీక్షా ప్యాడ్లు అందజేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకల పంపిణీ నిర్వహించారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బందువులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, జ్యోతి, టైలర్ రమేష్, బస్సు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
