విద్యారంగ అభివృద్ధికి కృషి
– విద్యాశాఖ తోడ్పాటుకు విజ్ఞప్తి
– డీఈఓ, ఎంఈఓలతో తాండూరు టీఆర్‌ఎస్ఎంఏ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ఎంఏ(తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) కృషి చేస్తుందని, ఇందుకు విద్యాశాఖ తోడ్పాటు అందించాలని తాండూరు నేతలు విజ్ఞప్తి చేశారు.

నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు కార్యవర్గం వికారాబాద్ జిల్లా అధికారి(డీఈఓ) అబ్దుల్ గని, తాండూరు మండల విద్యాధికారి(ఎంఈఓ) ఇందుప్రియలను మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు ఎంవీఎన్ మోహన్ కృష్ణ గౌడ్ , ప్రధాన కార్యదర్శి జి. వెంకటేష్ ఆధ్వర్యంలో డీఈఓ, ఎంఈఓలను సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యాభివృద్ధి కోసం విద్యాశాఖతో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఇందుకు డీఈఓ, ఎంఈఓలు నూతన కార్యవర్గాన్ని అభినందించి.. టీఆర్ఎస్ఎంఏ నిర్ణయానికి సహాకారం అందిస్తామని తెలిపినట్లు అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్ వారు తెలిపారు.

విద్యాశాఖ సహకారంతో తాండూరులోని ప్రైవేటు స్కూల్స్ అభివృద్ధికి, విద్యారంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్‌ఎంఏ గౌరవాధ్యక్షురాలు కీర్తి శర్మ, ఉపాధ్యక్షులు అబ్దుల్ వహీద్, సంయుక్త కార్యదర్శి సునీత, ట్రెజరర్ ఎం. రమేష్ గౌడ్, సలహా కమిటీ సభ్యులు ఇందూర్ రాములు, సొహైల్ ఉమ్రీ, రవీందర్ రెడ్డి(మాజీ అధ్యక్షులు), ఎం.డి. యూనుస్, శ్రీకాంత్ కులకర్ణితో నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


