రిజర్వేషన్ల సవాల్ స్వీకరించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రిజర్వేషన్ల సవాల్ స్వీకరించాలి
– బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బదులు ఇవ్వాలి
– స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం సీట్ల కేటాయింపు
– సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విసిరిన రిజర్వేషన్ల సవాల్ ను స్వీకరించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై 42 శాతం సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. సీఎం నిర్ణయం హర్షణీయమన్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తాయా.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆయా పార్టీలకు చేసిన సవాల్ ను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించాలని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామి మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లకు చట్టబద్దత కొరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి