పైలెట్ కు గ్రాండ్ వెల్ కమ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ కు గ్రాండ్ వెల్ కమ్..!
– అనంతగిరిలో స్వాగతం పలికిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు 
– రోహిత్ రెడ్డికి గజమాలతో సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు.

చాలా గ్యాప్ తరువాత రోహిత్ రెడ్డి సోమవారం తాండూరు వస్తున్నారు. మార్గ మధ్యలో అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు రోహిత్ రెడ్డిను కలిశారు. గజమాలతో సత్కరించి గ్రాండ్ వెల్ కమ్ పలికారు. రోహిత్ రెడ్డి తాండూరు పట్టణ అభివృద్ధి, ప్రజా సేవలో మరింత చురుగ్గా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కాన్సిలర్లు ఈర్షద్, నవీన సంతోష్ గౌడ్, రూప రుద్రు పాటిల్, అనంతలక్షి, ఉమా మహేశ్వరి, సుప్రీత కరుణాకర్, అనిల్, సురేశ్ నాయక్, నాయకులు సంతోష్ గౌడ్, రుద్రు పాటిల్, కరుణాకర్, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.

నాగ దేవతల్లారా.. దీవించండి..!