తొలగిన @ పాత కష్టాలు
– రోడ్డుకు శరవేగంగా మరమ్మత్తులు
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు వాసులు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న రోడ్డు కష్టాలు తీరిపోయాయి. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో రోడ్డు మరమ్మత్తుల పనులు గురువారం ప్రారంభమయ్యాయి. గత కొన్నిరోజుల క్రితం మిషన్ భగీరథ పనుల కారణంగా రోడ్డు తవ్వకాలు చే పట్టారు. దీంతో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. స్థానిక యువనాయకులు తాత్కాళిక మరమ్మత్తులు చేపట్టిన ఇబ్బందులు తప్పడం లేదు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్అండి అధికారులతో మాట్లాడి మరమ్మత్తుల పనులు చేయించేలా కృషి చేశారు. దీంతో శరవేగంగా రోడ్డు మరమ్మత్తుల పనులు కొనసాగాయి. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలపై కంకర వేసి జేసీబీ యంత్రంతో చదును చేయించారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో పాత తాండూరు వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.



