ఎమ్మెల్యేను కలిసిన

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేను కలిసిన
తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
– ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ 2026-2028 నూతన కార్యవర్గం ప్రతినిధులు సోమవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా తోడుబాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో మంచి ఫలితాలు తీసుకువస్తున్న ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులను అభినందించారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సూచించారు. నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ (ఐరా స్కూల్), అధ్యక్షులు గంజిపల్లి ప్రశాంత్ కుమార్, ( కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్), ఉపాధ్యక్షులు కల్పన (నాగార్జున స్కూల్), గూళి శివకుమార్ ( శివం స్కూల్), ప్రధాన కార్యదర్శి ద్యావరి జయవర్దన్ రెడ్డి ( శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్), సహకార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి ( స్మార్ట్ కిడ్స్), కవిత ( అభ్యాస్ స్కూల్), కోశాధికారి అబ్దుల్ సలీం ( అయేషా మోడల్ స్కూల్), పెద్దేముల్ మండల ఇన్చార్జి కరుణాకర్ రెడ్డి( వివేకానంద స్కూల్), బషీరాబాద్ మండల ఇన్చార్జి రాజశేఖర్ (బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్), లీగల్ అడ్వైజర్ జిలాని (ప్రగతి స్కూల్), ముఖ్య సలహాదారులు గోపీచంద్ ( కెపిహెచ్ఎస్), ఇస్మాయిల్ ( మోయిన్ కాన్వెంట్), అగ్గనూరు కిరణ్ కుమార్ (శివసాగర్ స్కూల్) జసింత ( సెయింట్ మేరీ స్కూల్)
ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు బాల్ రెడ్డి, తులసిదాస్, చంద్రశేఖర్, జగన్మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..!